కారును ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు మృతి

కారును ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.   చౌటుప్పల్ మండలం దండు  మల్కాపూర్  స్టేజి  దగ్గర అక్టోబర్ 31న తెల్లవారుజామున ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది  ప్రైవేట్ ట్రావెల్ బస్సు.  ఈ ఘటనలో  కారులో  ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  ఈ ప్రమాదంతో  రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

 ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు..  మృతులను  నకిరేకల్ కు చెందిన బొబ్బల నర్సింహా రెడ్డి (న్యాయవాది)(63), భార్య బొబ్బల సరోజినీ (58)గా గుర్తించారు. గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు.  పోస్టుమార్టం కోసం  మృతదేహాలను  చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.