కొల్లూరు చిరంజీవికి వెంటిలేటర్‌పై చికిత్స.. పరామర్శించిన ఈటెల, కవిత

కొల్లూరు చిరంజీవికి వెంటిలేటర్‌పై చికిత్స.. పరామర్శించిన ఈటెల, కవిత

హైదరాబాద్: తొలి మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరు చిరంజీవికి గచ్చిబౌలి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని తెలసి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేర్వేరుగా వచ్చి పరామర్శించారు. చిరంజీవి గారికి వెంటిలేటర్ మీద అందిస్తున్న చికిత్స గురించి మంత్రి ఈటెల డాక్టర్లతో చర్చించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. డాక్టర్ కొల్లూరు చిరంజీవి కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిగా తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మలిదశ  తెలంగాణ ఉద్యమంలో కూడా  పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన శ్వాస కోశ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ కొల్లూరు చిరంజీవి గారి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని మంత్రి ఈటెల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

చిరంజీవిని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు,  డాక్టర్ కొల్లూరి చిరంజీవిని సీఎం కేసీఆర్ కుమార్తె,  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‌పరామర్శించారు. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని  తెలుసుకున్న ఆమె హైదరాబాద్ లోని ఆసుపత్రికి వెళ్లారు. కుటుంబ సభ్యులు, వైద్యులతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైతే అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.

For More News..

మద్యం తాగి కారుతో బీభత్సం.. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పై కేసు

కోవిడ్ టీకా ధర రూ.250.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం

మోడీ కేరళ, అస్సాం వెళ్తారు.. రైతుల దగ్గరకు మాత్రం వెళ్లరు

క్లాస్ రూమ్‌లో లేడీ టీచర్ పై కత్తితో దాడి