
గాంధీజీ డైట్ విషయంలో ఎన్నో ప్రయోగాలు చేసి శరీరానికి సైతం రోగాల నుంచి విముక్తికలిగేలా చేశారు. ఫ్రీడం ఫైటర్, నేచురలిస్ట్, హెర్బలిస్ట్, మినిమలిస్ట్ గా... గాంధీ తన జీవితాంతం నిరంతరం ఎన్నో ప్రయోగాలు చేశారు. అప్పట్లో గాంధీజీ ఫాలో అయిన డైట్ ను ఇప్పుడు ఫాలో కాగలిగితే... ఎంతటి కాలుష్య వాతావరణంలో కూడా ఆరోగ్యంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదేం నోటి మాటగా చెప్తున్న విషయం కాదు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గాంధీ హెల్త్ రికార్డ్ ని పబ్లిష్ చేసింది. ఆయన సెల్ఫ్ మోటివేటేడ్ అండ్ వెల్ నెస్ గురు ఆఫ్ ఆల్ టైమ్ అని అందులో స్పష్టంగా రాసింది.
శరీరానికి సరిగ్గా సరిపడే డైట్ ని కనుక్కోవడానికి డైట్ పై గాంధీజీ ఎన్నో ప్రయోగాలు చేశారు. చివరి 35 ఏళ్లు ఆ డైట్నే పాలో అయ్యారు 'రా ఫుడ్' అంటే పచ్చి ఆహారాన్ని తినే బతికారు. ఆయన నలభై ఏళ్లపాటు రోజుకు కనీసం 23 వేల అడుగులు (దాదాపు 16.7 కిలోమీటర్లు) నడిచేవారు. ఎన్నో ఉపవాసాలు, నిరాహర దీక్షలు చేసిన తర్వాత.. మధ్య మధ్యలో రెగ్యులర్ ఉపవాసాలు ఉండాలని నిర్ణయించుకున్నారు. అలా తన అనుభవాలతో డైట్ గురించి పుస్తకాలు రాశారు. ఆరో గ్యంగా ఉండటానికి ఆయన రాసిన డైట్ అండ్ రీఫార్మ్ పుస్తకాన్ని చదివి, అందులో విషయాలను పాటిస్తే చాలు! డైట్ ఎలా ఉంటుందంటే...
నమలకపోవడమే సమస్య...
వేగం పెంచడానికంటే ముందు జీవితంలో చాలా ఉన్నాయి అనేవారు గాంధీజీ. నేను నా అనుభవం నుంచి చెప్తున్నాను. తిన్న ప్రతిసారీ ఒకటిరెండు వచ్చి ఆకుకూరల అకులు నమిలితే శరీరానికి ఎలాంటి హాని కలగదు. ఎక్కువ తిన్నప్పటితో పోలిస్తే.. తక్కువ తిన్నా కూడా నమిలి తిన్నప్పుడు ఎక్కువ శక్తి లభిస్తుంది. చపాతీని పప్పు లేదా కర్రీలో నంజుకొని తింటాం. దాని వల్ల నమలకుండానే మింగుతాం. అందుకే అందరికీ మింగటమే అలవాటుగా మారింది. నమలకలక పోవడం వల్లే శరీరానికి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అని డైట్ అండ్ డైట్ రీఫార్మ లో గాంధీ రాశారు. బయట మార్పు రావదానికంటే ముందు మన లోపలి నుంచే మార్పు రావాలని నమ్మేవారు గాంధీ.
తనతో తనకు గట్టి సంబంధం లేనప్పుడు.. చేస్తున్న పనికి సంబందించి బయటి ప్రపంచంలో మన బలం విస్తరించదు అనేవారు గాంధీ. పరుగులు పెడుతున్న మన జీవితాలు గాంధీజీ భావాలకు, ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండని అర్థమవుతోంది. ఇప్పుడు డాక్టర్లు, సైకాలజిస్టులు చెప్పే సలహాలు గాంధీజీ ప్రయోగాల నుంచే తీసుకున్నారేమో అనిపిస్తుంది.
శరీరం చెత్తకుండీ కాదు..
శరీరాన్ని చెత్త కుండీలా ట్రీట్ చేయకూడదు. నాలుక డిమాండ్ చేసే రుచికరమైన వాటిని అందులో పడేయొద్దు అనేవారు మహాత్మాగాంధీ. అంతేకాదు అతిగా తినడాన్ని, అదే పనిగా పిండి పదార్థాలు తినడాన్ని ఆయన వ్యతిరేకించారు. 1893, ఎండాకాలంలో గాంధీజీ పదకొండు రోజులు కేవలం రా ఫుడ్ మాత్రమే తిన్నారు. దీన్ని ఆయన వైటల్ ఫుడ్ (ప్రాణాధారమైన ఆహారం) అనేవారు. అది ఆయన మొదటి ప్రయోగం కాడు. చివరి ప్రయోగం అంతకన్నా కాదు. అలా తన ప్రయోగాలను కొనసాగిస్తూ వచ్చారు. ముందుగా వారాలు, తర్వాత నెలలు, ఏళ్లు ఇలా ఉడికించిన ఆహారానికి దూరంగా ఉండటం ప్రాక్టీస్ చేశారు.
ఏం తిన్నాను. తిన్న తర్వాత ఎలాంటి ఫీల్ కలిగింది? లాంటి విషయాలన్నీ ఆయన డైరీలో రాసుకునేవారు. దాన్నే ఇప్పుడు ఫుడ్ హెల్త్ జర్నల్స్ రికార్డ్ చేశాయి. అతనికి ఎప్పుడు జబ్బు చేసినట్టు అనిపించినా ఉపవాసం ఉండేవారు. ఎక్కువ వాటర్ ఫాస్టింగ్ ప్రాక్టీస్ చేసేవారు. ఇతరుల ఆరోగ్యం కోసం కూడా ఆయన ఉపవాసాలు చేసేవారు. ఆయన మొక్కలకు సంబంధించిన డైటీని నమ్మారు. ప్రొటీన్ పుడ్ ని కంట్రోల్ చేయాలనేవారు. ఆహారం పోషణకే కానీ, తిండిబోతుగా మారడానికి కాదు అని చెప్తుండేవారు.
చక్కెరకు చెక్
గాంధీజీ లైఫ్ స్టైల్ ని చూస్తే ఆయన రోగాల్ని ఎలా కంట్రోల్ చేశారో అర్ధం అవుతుంది. మనం తీపి తినాలనుకుంటే మొత్తం చెరకుగడ తినెయ్యాలి.. తియ్యని దుంపలు తినాలి, తియ్యని పండ్లు తినాలి, అంతేకానీ, చక్కెర తినకూడదు అని ఆయన తరచూ చెప్తుండేవారు. చక్కెర డయాబెటిస్, క్యాన్సర్ కు దారి తీస్తుందని ఆయన నమ్మేవారు. గాంధీజీ నేచురలిస్ట్. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు.. ఆహారంతోనే నయం చేసుకునేవారు. వంటగది బెస్ట్ ఫార్మసీ అని చెప్తుండేవారు. అందుకే ఆయన వయసు పెరిగినా ఎనర్జిటిక్ గా ఉండేవారు. శరీరం శుభ్రంగా, బ్యాలెన్సుడుగా ఉండాలంటే లిమిటెడ్ గా తినాలని గాంధీజీ ప్రచారం చేశారు. ఏం తిన్నా సూర్యాస్తమయానికి ముందే తినాలనేవారు. ఆయన సాధనలన్నీ సైంటిఫికిగా ప్రూవ్ అయ్యాయి.
గాంధీ డైట్:
ములకెత్తిన గోధుమలు-: ఎనమిది తులాలు (80 గ్రాములు)
స్వీట్ ఆల్మండ్స్ పేస్ట్:- ఎనిమిది తులాలు
ఆకు కూరలు (పచ్చివి) నూరి: ఎనిమిది తులాలు
తేనె - రెండు ఔన్సులు(57గ్రాములు)
సాధారణంగా ఇదేనా డైట్. దీన్ని కూడా రోజుకు రెండుసార్లు మాత్రమే తీసుకుంటాను. ఉదయం పదకొండు గంటలకు ఒకసారి, సాయంత్రం 6.15 కి రెండోసారి. ఉదయం, మధ్యాహ్నం ఒకసారి గోరువెచ్చని నీళ్లలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగుతాను. డైట్ అండ్ డైట్ రీఫార్మ్ లో రాశారు. బ్రహ్మచారికి తాజా పండ్లు, నట్స్ పర్ ఫెక్ట్ ఫుడ్ అని నా ఆరేళ్ల ప్రయోగాలతో తెలిపొచ్చింది. ఆడైట్ ఫాలో అవుతున్నప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉంటాను, అదిలేకుండా నాకు నేనే నాలాగా అనిపించను అని చెప్తుండేవారు. ఆయన ఉదయం ఏడింటికి పండ్లు తిని వాకింగ్ కు వెళ్లేవారు. ప్రకృతి ఇచ్చే సహజమైన వాటినే ఆయన తీసుకునేవారు.
మినిమలిస్ట్
కాలింగ్ బెల్ మోగగానే.. మేరికోందో ఇంట్లోకి వస్తుంది. పేరుకుపోయిన అవసరం లేని వస్తువులన్నింటినీ తీసేసి ఇంటిని అద్దంలా మార్చేస్తుంది. మినిలిస్ట్ గా ఆషో నెట్ ఫ్లిక్స్ తో పూపర్ హిట్ అయ్యింది. ఈ పని గాంధీజీ వందేళ్ల కిందే చేశారు. కేవలం ఇంటినే కాదు మైండ్ దీక్షట్టరింగ్ కూడా ప్రాక్టీస్ చేశారు. తనను తాను సున్నకు తగ్గించుకోవాలను కునేవారు గాంధీ. వీలైనంత తక్కువ వస్తువులతో జీవించాలనేది ఆయన సిద్ధాంతం, ఢిల్లీలోని నేషనల్ గాంధీ మ్యూజియానికి వెళితే.. మహాత్ముని అనుభవాలన్నీ వరుసగా డిస్ ప్లేలో కనపడతాయి. కొంచెం ముందుకు వెళితే ఆయన వాడిన సూట్ కేస్ ఉంటుంది. అందులో ఆయన వస్తువుల కంటే ఎక్కువ ఖాళీ స్థలమే ఉంటుంది. అది ఆయన ఎంత గొప్ప, మినిమలిస్ట్ అని చెప్పేందుకు ఆధారం!