మీరు బస్సులో లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు క్యాండీ క్రష్ గేమ్ ని ఆడి ఉండొచ్చు. కానీ అలా ఆ రంగురంగుల క్యాండీలను తమపై వేసుకున్న వారిని ఎప్పుడైనా చూశారా? ఇది వింతగా అనిపించినా.. అదే నిజం. డిజైనర్ క్రిస్టియన్ కోవన్ ఇటీవలే 'క్యాండీ క్రష్' బీన్‌బ్యాగ్ దుస్తులను ప్రారంభించగా.. NYC సబ్‌వే వీధుల్లో ఫంకీ వేర్‌లను ప్రదర్శించిన ఓ రిపోర్టర్.. ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది,
న్యూయార్క్ పోస్ట్ రిపోర్టర్ టేలర్ నైట్ న్యూయార్క్ నగరంలో షికారు చేయడానికి, అందరి దృష్టిని ఆకర్షించడానికి ఓ విచిత్రమై డ్రెస్సులో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించడంతో.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టేలర్‌కు అసలు సీటు అవసరం లేదని, ఆమె ఈ దుస్తులతో సాధారణంగా నేలపై ఎలా కూర్చోవచ్చో కూడా ఈ ఫొటోల్లో చూపించింది.
సీట్లు అందుబాటులో లేనప్పుడు రైల్లో నేలపై కూర్చోవడానికి ఉద్దేశించిన దుస్తులుగా ఇవి కనిపిస్తున్నయి. లైక్రాతో తయారు చేసిన ఆకట్టుకునే డిజైన్ తో కనిపిస్తోంది. వెనిగర్, నీటి మిశ్రమాన్ని దీనిపై ఉపయోగించినా అది తన పరిమాణంలో ఎలాంటి మార్పులూ రావని సమాచారం. అలాగే బీన్‌బ్యాగ్‌ల లాంటి దుస్తులు ధరించడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు, జపాన్ నుంచి ఇలాంటి ఫ్యాషన్ ట్రెండ్ వైరల్ అయింది.
