జమ్మూ కాశ్మీర్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై ఇండియన్ రైల్వేస్ గురువారం విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. చీనాబ్ రైల్వే బ్రిడ్జి రాంబన్ జిల్లాలోని సంగల్దాన్, రియాసి మధ్య నిర్మించబడింది. ఈ మార్గంలో రైలు సేవలు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
#WATCH | J&K: Indian Railway conducts a trial run on the newly constructed world's highest railway bridge-Chenab Rail Bridge, built between Sangaldan in Ramban district and Reasi. Rail services on the line will start soon pic.twitter.com/gHGxhMHYe3
— ANI (@ANI) June 20, 2024
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని అందమైన పర్వతాలు, చీనాబ్ నదిపై ఉన్న ఎత్తైన రైల్వే వంతెనపై ప్రయాణిస్తూ చూడవచ్చు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని ఎక్స్ లో షేర్ చేశారు. ఈ వంతెన చినాబ్ నదిపై 359 మీటర్లు (109 అడుగులు) నిర్మించబడిన బ్రిడ్జ్, ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్ట్ కింద నిర్మించబడింది. ఇది ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది.
Successful trial run of MEMU train between Sangaldan - Reasi section of USBRL project.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 20, 2024
?Jammu & Kashmir pic.twitter.com/GjaKX6Ci8Q
