- మొదలైన ఎన్నికల ప్రచారం
- సర్పంచ్‌కు, వార్డుకు ముగ్గురేసి పోటీదార్లు
- ప్రధాన పార్టీలకు రెబెల్స్ భయం
- నల్గొండ జిల్లాలో 16, సూర్యాపేటలో 7, యాదాద్రిలో 14 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం
నల్గొండ, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఎక్కువ గ్రామాల్లో ఒక్కో సర్పంచ్ పదవికి ముగ్గురేసి పోటీపడుతున్నారు. వార్డు స్థానాల్లో కూడా దాదాపు ఇదే రకమైన పోటీ నెలకొంది. నల్గొండ డివిజన్లో 200 పంచాయతీలకు 615 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1706 వార్డులకు 3,924 మంది బరిలో ఉన్నారు. సగటున ఒక్కో పంచాయతీలో ముగ్గురు సర్పంచ్‌లు, ముగ్గురు వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. నల్గొండ రూరల్, కనగల్, నకిరేకల్ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో సైతం చండూరు డివిజన్లో 96 పంచాయతీలకు 351 మంది బరిలో ఉన్నారు.
సగటున ముగ్గురు, నలుగురు సర్పంచ్‌గా పోటీలో ఉన్నారు. 7 85 వార్డులకు 2010 మంది అభ్య ర్థులు పోటీ పడుతున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో 152 పంచా యతీల్లో 473 మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు. సగటున గ్రా మానికి ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోనే కాంగ్రెస్‌లో వర్గ పో రు నెలకొంది. 1242 వార్డులకు 2,911 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఆసక్తికరంగా మొదటి విడత ఎన్నికల పోరు
ఉమ్మడి జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది. ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు ధీటుగా రెబల్స్ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఓట్లు చీలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సర్పంచ్ స్థానాలే గాక, వార్డుల్లో త్రిముఖ పోటీ నెలకొంది. పలు చోట్ల కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే పోటీ ఏర్పడింది. పొత్తులు సైతం ఆసక్తికరంగా మారాయి. పలు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకుంది. ఇంకొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్కు బీజేపీ, సీపీఎం మద్ధతు ఇస్తోంది. స్థానిక పరిస్థితులకు తగినట్టుగా పరసర్ప అవగాహన కుదర్చుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన లీడర్లు సైతం సర్పంచ్ పదవికి పోటీ పడటంతో ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేక చివరకు ఊరి పెద్దలకే వదిలేశారు. అందరూ సమన్వయంతో ఏకాభిప్రాయానికి రావాలని, భవిష్యత్తులో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార ఎన్నికల్లో అవకాశాలు ఉంటాయని, ఆ మేరకు పంచాయతీ ఎన్నికల్లోనే ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏకాభిప్రాయం కుదరని చాలా గ్రామాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. దీన్ని బీఆర్ఎస్ అవకాశంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
మొదలైన ప్రచారం
అభ్యర్డులు ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్డులు ఒక ఛాన్స్ అంటూ ఇంటింటికీ తిరిగి అభ్యర్డులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల మద్దతు ఇవ్వగా గుర్తులతో ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లకు ఫోన్ చేసి ఎన్నికల రోజు వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రచారానికి మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్డులు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఏకగ్రీవలైన గ్రామాలు
నల్గొండ జిల్లాలో మొత్తం 16 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా, సూర్యాపేటలో 7 , యాదాద్రి భువనగిరిలో 14 ఏకగ్రీవమయ్యాయి. నల్గొండ నియోజక వర్గంలో బచ్చన్న గూడెం, తెలకంటిగూడెం, కంకణాలపల్లి, మర్రిగూడెం, సోమెరిగూడెం, రసూల్ పురం, ఖుదావానిపూర్, మునుగోడు నియోజక వర్గంలో కొట్టాల, చొప్పరివారిగూడెం, కమ్మగుదెం, బండతిమ్మాపురం, ఫకీర్ పురం, నామ్యానాయక్ తండా, నెమళ్ళగూడెం, నకిరేకల్ నియోజక వర్గంలో దాసరిగూడెం, షేర్ బావి గూడెం, మల్లపురం, దుగినేల్లి, ఉప్పలపహాడ్, గొల్లగూడెం గ్రామ పంచాయితీలు ఏకగ్రీవం కాగా సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలంలో కోఖ్యా తండా, సిద్ధి సముద్రం, మొండి చింత తండా, రాజా నాయక్ తండ, తుంగతుర్తి మండలంలోని తూర్పు గూడెం, సూర్యాపేట మండలంలో దుబ్బా తండా, మద్దిరాల మండలంలో ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవం అయింది.
