కరోనాపై గిరిజనులకు అవగాహన కల్పించాలి

కరోనాపై గిరిజనులకు అవగాహన కల్పించాలి
  • ఐటీడీఏ, గిరిజన సంక్షేమ అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్​ ఆదేశం

గిరిజనులకు కరోనా వైరస్​పై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్​ అధికారులను ఆదేశించారు. బుధవారం సంక్షేమ భవన్ లో ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల డ్యూటీలో ఉన్న టీచర్లు, లెక్చరర్లు, అధికారులంతా పరీక్షలు పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థుల వెంట తోడుగా వెళ్లాలని సూచించారు. హాస్టళ్లలో ఎక్కువ మంది స్టూడెంట్లు ఒకే గదిలో ఉండకుండా చర్యలు తీసుకోవాలని.. స్టూడెంట్స్​కు కరోనా వైరస్ పట్ల పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రతను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఐటీడీఏల పరిధిలోనూ కరోనా వైరస్ కు సంబంధించిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజనులకు ఉపయోగపడే కుటీర పరిశ్రమల స్థాపనకు ప్రయత్నించాలని.. తక్కువ నిధులతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరే పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మేడారంలో జాతర అనంతర పనులు, పారిశుద్ధ్యాన్ని పరిశీలించాలని సూచించారు.