శాడిస్ట్ సాఫ్ట్ వేర్ మొగుడు.. మోజు తీరాక రెండో పెళ్లికి రెడీ..భర్త ఇంటి ముందు భార్య ధర్నా

శాడిస్ట్  సాఫ్ట్ వేర్  మొగుడు.. మోజు తీరాక రెండో పెళ్లికి  రెడీ..భర్త ఇంటి ముందు భార్య ధర్నా

తనకు న్యాయం చేయాలంటూ రంగారెడ్డి జిల్లాలో భర్త ఇంటి ముందు ధర్నాకు  దిగింది ఓ యువతి. తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని  తనకు న్యాయం చేయాలని  భర్త ఇంటి ముందు బైఠాయించింది యువతి.   

అసలేం జరిగిందంటే.. బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్  సాయి బాలాజీ నగర్ కాలనీకి చెందిన  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీధర్ కుమార్ , పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన  సాఫ్ట్ వేర్ ఇంజినీర్  స్రవంతి లవ్ చేసుకున్నారు. నువ్వంటే  అంటే నాకు ఇష్టం, నువ్వు  లేకుండా బ్రతకలేను,నువ్వే  నా సర్వస్వం అంటూ వెంటబడి స్రవంతిని 2020లో  పెళ్లి చేసుకున్నాడు శ్రీధర్ . అతని ప్రేమ నిజమని నమ్మిన స్రవంతి  తల్లిదండ్రులను ఎదురించి వివాహం చేసుకుంది. 

వివాహం జరిగిన నాలుగు నెలల నుంచి నరకం చూపించిన సాడిస్ట్ సాఫ్ట్ వేర్  భర్త శ్రీధర్ కుమార్   పిల్లలు పుట్టకుండా  భార్యను  టాబ్లెట్స్ వేసుకొమ్మనే వేధించేవాడని భార్య స్రవంతి ఆరోపిస్తోంది .  మోజు తీరిన తరువాత  నీతో అవసరం లేదని తన భర్త ఇంటి నుంచి గెంటేశాడని... తాను వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటానని  బెదిరిస్తున్నాడని చెప్పింది.  తనకు న్యాయం కావాలని.. న్యాయం జరిగేంత వరకు ఇంటి ముందు నుంచి కదిలేది లేదని బండ్లగూడలోని భర్త ఇంటి ముందు  యువతి ధర్నాకు దిగింది.