WI vs AUS: స్మిత్ ఔట్..19 ఏళ్ళ కుర్రాడు ఎంట్రీ: 53 టెస్టుల తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన లాబుస్చాగ్నే

WI vs AUS: స్మిత్ ఔట్..19 ఏళ్ళ కుర్రాడు ఎంట్రీ: 53 టెస్టుల తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన లాబుస్చాగ్నే

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు.. టెస్ట్ స్పెషలిస్ట్ మార్నస్ లాబుస్చాగ్నేకు ఆసీస్ సెలక్టర్లు షాక్ ఇచ్చారు. వెస్టిండీస్ తో జూన్ 25 నుంచి జరగబోయే టెస్ట్ సిరీస్ కు ఆస్ట్రేలియా స్క్వాడ్ నుంచి తప్పించారు. నాలుగేళ్లుగా ఆసీస్ జట్టులో రెగ్యులర్ గా ఉంటూ ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడిన మార్నస్ పై ఫైనల్ గా సెలక్టర్లు కొరడా ఝులిపించారు. రెండేళ్లుగా లాబుస్చాగ్నే పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ (17,22) ల్లో విఫలం కావడంతో అతడిని జట్టులో కొనసాగించటానికి ఆసీస్ సెలక్టర్లు ఆసక్తి చూపించలేదు.

"మార్నస్ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. అతని ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. అతని నైపుణ్యానికి విలువనిస్తూనే ఉంటాము.   అతను సవాలును సానుకూలంగా అధిగమించాలని ఆశిస్తున్నాం". అని చీఫ్ సెలక్టర్ బెయిలీ అన్నాడు. లాబుస్చాగ్నే ఓవర్ల గా తన టెస్ట్ కెరీర్ లో 104 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 46.19 సగటుతో 4436 పరుగులు చేశాడు. వీటిలో 11 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2023లో మాంచెస్టర్‌లో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత అతను ఒక్క టెస్ట్ సెంచరీ కూడా చేయలేదు. చివరి నాలుగు టెస్టుల్లో అతని యావరేజ్ 25 మాత్రమే ఉంది. 

లాబుస్చాగ్నేతో పాటు స్టీవ్ స్మిత్ తొలి టెస్టుకు ఎంపిక కాలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్లో బవుమా క్యాచ్ అందుకునే క్రమంలో స్మిత్ చేతి వెలికి గాయమైంది. దీంతో స్మిత్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. రెండో టెస్టులో స్మిత్ ఆడే అవకాశం ఉంది. 51 టెస్టుల తర్వాత స్మిత్ ఒక టెస్ట్ మ్యాచ్ కు దూరం కావడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా స్క్వాడ్ విషయానికి వస్తే స్మిత్,లాబుస్చాగ్నే స్థానాల్లో 19 ఏళ్ల సామ్ కాన్స్టాస్, జోష్ ఇంగ్లిస్‌లను సెలక్ట్ చేశారు. భారత్ తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కాన్స్టాస్ అదరగొట్టాడు. బుమ్రా బౌలింగ్ లో ఎటాకింగ్ షాట్స్ ఆడుతూ దూకుడు చూపించాడు. మరోవైపు ఇంగ్లిస్ ఇటీవలే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాకప్ వికెట్ కీపర్ గాను జట్టులో కొనసాగుతాడు. 

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు:

పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ, బ్యూ వెబ్‌స్టర్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లియాన్, మాట్ కుహ్నెమాన్