కరోనా పేషెంట్లకు రిటైర్ డాక్టర్ ట్రీట్‌మెంట్ : వైరస్ సోకి మృతి

కరోనా పేషెంట్లకు రిటైర్ డాక్టర్ ట్రీట్‌మెంట్ : వైరస్ సోకి మృతి

కరోనా వైరస్ సోకి రిటైర్ డాక్టర్ కన్నుమూశాడు. ప్రపంచ వ్యాప్తంగా  వైరస్ తో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు.

ఈ మహమ్మారి కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు అన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. డాక్టర్లు పేషెంట్ల కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టి నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో డాక్టర్లు సైతం కరోనా వైరస్ సోకి మరణించడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కరోనా వైరస్ సోకి డాక్టర్ మృతి చెందాడు.

ది గార్డియన్ వివరాల ప్రకారం ఫ్రాన్స్ కు చెందిన జీన్-జాక్వెస్ రజాఫింద్రనాజీ డాక్టర్ రిటైర్ అయ్యారు. అయినా కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు స్వచ్ఛందంగా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నాడు. తాజాగా  కాంపిగ్నేలోని ఓయిస్ డెపార్ట్‌మెంట్‌లోని ఎమర్జెన్సీ వార్డ్ లో పనిచేస్తున్న జీన్ కు కరోనా వైరస్ సోకింది. అత్యవసర చికిత్స కోసం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మరణించినట్లు ది గార్డియన్ తెలిపింది.

ఈ సందర్భంగా ఆయన కుమారుడు మాట్లాడుతూ డాక్టర్ గా రిటైర్ అయినప్పటికి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కరోనా వైరస్ బారిన పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇచ్చాడని ప్రశంసల వర్షం కురిపించాడు.

మా నాన్న కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు వెళుతున్నానని ప్రకటించడంతో కుటుంబ సభ్యులందరూ ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. కానీ నాన్నమాత్రం  విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు…అందుకు సిద్ధంగా ఉన్నానని తమతో అన్నట్లు చెప్పాడు.