
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం, ఇందిర గిరి జల వికాసం స్కీమ్స్ తో గిరిజనులకు మంచి రోజులు వచ్చాయని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. యువ వికాసం స్కీమ్ తో 91,681 మంది గిరిజనులకు వెయ్యి కోట్లు రుణాలు అందనున్నాయని తెలిపారు. ఇందిర సోలార్ గిరి జల వికాసం స్కీమ్ తో 2 లక్షల మంది ఫారెస్ట్ హక్కులు ఉన్న రైతులకు రూ. 12,600 కోట్లతో సోలార్ పవర్, బోర్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
గురువారం సంక్షేమ భవన్ లో ట్రైకార్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది అయిన సందర్భంగా బెల్లయ్య నాయక్ కు ట్రైకార్ జీఎం శంకర్ రావు, మేనేజర్ లక్ష్మీ ప్రసాద్, డీజీఎం రవికుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న సబ్సిడీ నిధులు రూ. 221 కోట్లు రిలీజ్ చేసేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు.