
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలో కాంగ్రెస్ టార్గెట్‌గా ఈసీ అక్రమంగా ఓట్లను తొలగించిందని ఆరోపించారు. సెంట్రలైజ్డ్ సిస్టమ్ తో ప్లాన్ ప్రకారమే ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. బాధితులను ప్రత్యక్ష సాక్షులుగా మీడియా ముందుంచారు రాహుల్‌గాంధీ. కాంగ్రెస్ ను ఓడించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లను అక్రమంగా తొలగించారు మా దగ్గర పక్కా ఆధారాలున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు.
న్యూఢిల్లీ: కర్ణాటకలో అక్రమంగా ఓట్లను తొలగించింది ఈసీ.. ఓటర్లకు తెలియకుండా ఓటర్ లిస్టు నుంచి డిలీట్ చేశారు. మాదగ్గర 100 శాతం పక్కా ఆధారాలున్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ, పార్లెమెంటరీ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ ఓట్లు తొలగించబడిన బాధితులను మీడియా ముందు ఉంచారు రాహుల్ గాంధీ.
►ALSO READ | బిహార్ లో .. పీకే హవా పెరుగుతోందా?
కర్ణాటకలో పక్కా ఓట్ల చోరీ జరిగింది.. కాంగ్రెస్ టార్గెట్‌గా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లను తొలగించారు. ఉద్దేశపూర్వకంగానే ఓట్లను తొలగించారని. కర్ణాటకలో ఓట్లచోరీని మేం అడ్డుకున్నామని రాహుల్ అన్నారు. ఫేక్ అప్లికేషన్లు ఫైల్ చేశారని మా దగ్గర పక్కా ఆధారాలున్నాయంటూ స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
CEC జ్ణానేశ్వర్ కుమార్ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.కర్ణాటకలో ఓట్లను తొలగించేందుకు ఇతర రాష్ట్రాల ఫోన్ నంబర్లు వాడారని అన్నారు. సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల్లోనే 14 అప్లికేషన్లు వెళ్లాయన్నారు. ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థనే హైజాక్ చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఓట్ల చోరులను చీఫ్ ఎలక్షన్కమిషనర్ రక్షిస్తున్నారని అన్నారు. కర్ణాటక సీఐడీ అడిగిన వివరాలను వారంలోగా ఈసీ ఇవ్వాలని రాహుల్ గాంధీడిమాండ్ చేశారు.
కర్ణాటక ఎన్నికల సమయంలో వేలసంఖ్యలో ఓట్లను తొలగించారు..సెంట్రలైజ్డ్ సిస్టమ్ తో ప్లాన్ ప్రకారమే ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ టార్గెట్ గానే ఓట్ల తొలగింపు చేశారని అన్నారు రాహుల్ గాంధీ. మరోవైపు మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో 6851 ఓట్లను అక్రమంగా తొలగించారని రాహుల్ గాంధీ అన్నారు.