
తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఏనుగు నర్సింహా రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డైరెక్టర్ గా ఉన్న మామిడి హరికృష్ణను తొలగించిన ప్రభుత్వం.. ఏనుగు నర్సింహా రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా సేవలు అందించిన మామిడి హరికృష్ణను వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల అదనపు రిజిస్ట్రార్‌గా బదిలీ చేసింది.
ఏనుగు నరసింహారెడ్డి కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు. 2017 నుండి 2020 వరకు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శిగా పనిచేశాడు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పనిచేస్తున్నారాయన.
►ALSO READ | అంధుల పాఠశాల నిర్మాణానికి చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన నరసింహా రెడ్డి.. గ్రూప్ 2 ఉద్యోగంతో ప్రస్థానం మొదలైంది. ఉద్యోగ బాద్యతలతో పాటు సాహిత్యంలో తనదైన ముద్ర వేసి గుర్తింపు తెచ్చుకున్నారు. నవలలు, సంపాదకీయాలు, విమర్శనా గ్రంథాలతో పేరు తెచ్చుకున్న నరసింహారెడ్డిని తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా నియమించింది ప్రభుత్వం.