మహిళలు ఆరోగ్య శిబిరాల్ని ఉపయోగించుకోవాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

మహిళలు ఆరోగ్య శిబిరాల్ని ఉపయోగించుకోవాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
  • సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

కోదాడ, వెలుగు: దేశంలోని మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారీ సశక్త్  పరివార్  అభియాన్  ప్రవేశపెట్టిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.  బుధవారం కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెస్టులు చేసి అవసరమైన మందులను అక్కడికక్కడే అందజేస్తారని తెలిపారు. డీఎంహెచ్ ఓ చంద్రశేఖర్, డీసీహెచ్‌ ఎస్ వెంకటేశ్వర్లు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ దశరథ తదితరులున్నారు.