కేజీబీవీ, ఇంటర్మీడియట్ ఫలితాలపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కేజీబీవీ, ఇంటర్మీడియట్ ఫలితాలపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : కేజీబీవీ, ఇంటర్మీడియట్ కాలేజీలో ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా పాఠశాలలు, ఇంటర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.  బుధవారం నల్గొండలోని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కేజీబీవీలు, ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలు, అప్లికేషన్, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. 

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..   3 సంవత్సరాల్లో  ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరత తీర్చడమే కాకుండా, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. అడ్మిషన్స్ పెరిగే విధంగా ప్రిన్సిపల్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కొన్ని కాలేజీల్లో ఫలితాలు తక్కువగా ఉన్నాయని, అలాంటి కళాశాలల్లో ఫలితాలు పెంపొందించడం పై దృష్టి సారించాలన్నారు.  నల్గొండ మండలంలోని, దోమలపల్లిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తనిఖీ చేశారు.  

దోమలపల్లికి 70 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా, 56  ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ 56 ఇళ్లలో పూర్తయిన  ఇళ్లకు తక్షణమే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  జిల్లా ఇంటర్మీడియట్ వైద్యాధికారి దస్రు నాయక్, డీఈవో భిక్షపతి , ఆర్డీవో వై. అశోక్ రెడ్డి,ఆర్సీఓ స్వప్న, బలరాం,నల్గొండ తహసీల్దార్ పరుశురాం, తదితరులు పాల్గొన్నారు.