
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మదరాసి. మురుగదాస్ తెరకెక్కించిన ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ, అక్టోబర్ 3న స్ట్రీమింగ్కి రానుందని టాక్. తమిళం, తెలుగు మరియు ఇతర భాషలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ స్ట్రీమింగ్ డేట్పై మేకర్స్ నుంచి త్వరలో క్లారిటీ రానుంది.
మదరాసి బడ్జెట్ & వసూళ్లు:
మదరాసి మూవీని శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మాణ సంస్థ రూ.180 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. విడుదలకు ముందే వందకోట్ల మేరకు బిజినెస్ జరుపుకుంది. ఇందులో భాగంగా మదరాసి డిజిటల్ & శాటిలైట్ హక్కులు మంచి రేటుకే అమ్ముడయ్యాయి. డిజిటల్ హక్కులను దాదాపు రూ.60 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కులను రూ.26 కోట్లకు జీ టీవీ ఛానల్ సొంతం చేసుకున్నాయని టాక్. ఇలా భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ఊహించని విధంగా మిక్సెడ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ముందస్తు అంచనాలు అందుకోలేకపోయింది.
మితిమీరిన యాక్షన్తో మురుగదాస్ కథ, కథనాలపై పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేకపోయాడు. అందువల్ల మదరాసి వరల్డ్ వైడ్గా కేవలం రూ.91 కోట్ల గ్రాస్, ఇండియా వైడ్గా రూ.59కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో విద్యుత్ జమాల్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు
డైరెక్టర్ మురుగదాస్ ఎక్కడ?
మదరాసి సినిమాతో మురుగదాస్ ఏ మాత్రం తన మార్క్ చూపించలేకపోయారు. ఒకప్పటి మురుగదాస్ ఎక్కడ? అని వెతుకున్నే సందర్భాన్ని తీసుకొచ్చాడు. మురుగదాస్ సినిమా అంటే ఒక రమణ (తెలుగులో ఠాగూర్).. ఒక గజిని.. ఒక కత్తి.. ఒక స్టాలిన్, ఒక తుపాకి..! ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ ఇలాంటి అద్భుతాలే. చెప్పేది పాత కథే అయినా అందులో ఓ బలమైన ఎమోషన్ ఉండేలా చూసుకునేవాడు. కానీ ఇప్పుడలా కాదు. ఆ మురుగదాస్ బూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. గత సినిమాలు స్పైడర్, దర్భార్, సర్కార్, సికిందర్, ఇప్పుడు మదరాసి. ఇక వచ్చే సినిమాల్లో అయిన తన మార్క్ కోసం ఎదురుచూస్తున్నారు సినీ ఆడియన్స్.