ది కేరళ స్టోరీ నటిపై.. నెటిజన్స్ ఫైర్

ది కేరళ స్టోరీ నటిపై.. నెటిజన్స్ ఫైర్

దేశ వ్యాప్తంగా ది కేరళ స్టోరీపై  తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన  సిద్ధి ఇద్నాని కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ సినిమాలో సిద్ది ఇద్నాని గీతాంజలి అనే కీ రోల్ లో నటించింది. అయితే ది కేరళ స్టోరీపై వస్తున్న విమర్శలపై సిద్ధి ఇద్నాని ఓ పోస్ట్ పెట్టింది. సినిమాలో తప్పుగా ఏం చూపించలేదు  అంటూ  పోస్ట్ లో పేర్కొంది. 

బాధ్యతగా ఫీలవుతున్న..

ది కేరళ స్టోరీ  సినిమా వివాదాస్పద స్టోరీ కాదని.. సమాజంలో ప్రజలందరికీ అవగాహన కల్పించే సినిమా మాత్రమేనని సిద్ది ఇద్నాని  పేర్కొంది. ఇది ఏ మతాన్ని కించపరిచేది కాదని.. తీవ్రవాదాన్ని మాత్రమే ఖండించే చిత్రం అని తెలియజేసింది. ది కేరళ స్టోరీ వంటి సినిమాలో నటించడం  బాధ్యతగా ఫీలవుతున్నట్టు సిద్ధి ఇద్నాని తెలిపింది. సిద్ది ఇద్నాని పోస్ట్ పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెపై సోషల్  మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు అభిమానులు అమెకు మద్దతుగా నిలుస్తున్నారు. 

కాగా సిద్ధి ఇద్నాని హీరో తెలుగులో జంబలకిడి పంబ, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, ప్రేమకథా చిత్రం 2 సినిమాల్లో నటించింది. కాగా హీరో శింబు ప్రధాన పాత్రలో సిద్ధి ఇద్నాని నటించిన వెందు తనిందది కాడు చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. నటుడు హరీష్ కల్యాణ్ కు జంటగా నిటించిన నూరు కోడి వానవిల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్యకు జంటగా ఖాదర్ భాషా చిత్రంలో నటిస్తోంది.