
ముంబై: రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖంచందానీని పోలీసులు అరెస్ట్ చేశారు. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ) స్కామ్‌లో హస్తం ఉందనే ఆరోపణలపై వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని టీవీ చానళ్లు టీఆర్పీ నంబర్‌ల విషయంలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నాయని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) కేసు ఫైల్ చేయడంతో ఈ స్కామ్ బయటపడింది. ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసేందుకు చానళ్లు టీఆర్పీ రేటింగ్స్‌ను తారుమారు చేస్తున్నాయని విచారణలో తేలింది. కొందరు టీవీ ప్రేక్షకులకు డబ్బుల రూపంలో లంచం ఇచ్చి, టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి రిపబ్లిక్ టీవీ యత్నించిందని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో వెలుగుజూసింది.