మున్సిపల్ ఎలక్షన్స్: జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను నియమించిన TRS

మున్సిపల్ ఎలక్షన్స్: జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను నియమించిన TRS

మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేషన్ కోసం ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జిలను నియమించింది TRS. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సమీక్ష జరిపారు.  హైదరాబాద్ శివారులోని కార్పొరేషన్లపైనా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. ఈ కార్పొరేషన్లలో విజయం పార్టీకి చాలా కీలకమని మంత్రి మల్లారెడ్డికి వివరించారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల పరిస్థితి పై ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ రెండు కార్పొరేషన్లలో బీజేపీ,  కాంగ్రెస్  కుమ్మక్కై, లోపాయికారీగా కలిసి పని చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.

మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం సమన్వయ కమిటీని నియమించారు కేటీఆర్. ఉమ్మడి జిల్లాల వారీగా 9 మందితో కమిటీని ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు భవన్ నుంచే ఫుల్ టైమ్ పని చేయాలని సూచించారు. కమీటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రాంమ్మోహన్, గట్టు రాంచందర్ రావు, దండె విఠల్, MLC లు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు ఉన్నారు. కమిటీ సభ్యులు ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యత తీసుకుని స్దానిక MLA లు, సీనియర్ నేతలతో మాట్లాడాలని సూచించారు. దీంతో పాటు జిల్లాల్లోని ప్రతీ మున్సిపాల్టీల్లోని ఎన్నికలను నేరుగా పర్యవేక్షించాలని ఆదేశించారు.  అభ్యర్ధుల ప్రచారానికి అవసరమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని, ఇందుకోసం ప్రతిరోజు పార్టీ నాయకులతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని అదేశించారు. సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బీఫాం ఇచ్చే వారు కాకుండా పార్టీ తరపున నామినేషన్ వేసిన అభ్యర్ధులతో మాట్లాడి, విత్ డ్రా చేసుకునేలా చూడాలన్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేయాలన్నారు కేటీఆర్.