రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ పూర్తి అయ్యింది. 10 మంది కొత్త మంత్రులతో కొలువుదీరింది. దీంతో కేబినెట్ విస్తరణ తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. శుక్రవారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో రేపు సాయంత్రం నాలుగున్నరకు ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, బడ్జెట్ కేటాయింపులను మంత్రులకు వివరించనున్నారు.

గత ప్రభుత్వంలో ఈటల రాజేందర్….ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నిరంజన్ రెడ్డికి దక్కవచ్చని ప్రచారం జరిగినా…వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలు కేటాయించారు. సీఎం దగ్గర సాధారణ పరిపాలన, ఆర్థిక, నీటిపారుదల, విద్యుత్ శాఖలతో పాటు మంత్రులకు కల్పించని ఇతర శాఖలు ఉన్నాయి. రేపు అర్ధరాత్రి వరకు అవి అందుబాటులోకి రానున్నాయి. దీంతో  శుక్రవారం ఉదయం పదకొండున్నరకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రానున్న ఆర్ధిక సంవత్సరానికి పూర్తి స్థాయి ప్రతిపాదనలతో సభలో సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సారి బడ్జెట్ 2 లక్షల కోట్లకు పైనే ఉండే అవకాశం ఉంది.