రాజగోపాల్ రెడ్డికి అల్ ది బెస్ట్ చెప్పిన కూసుకుంట్ల

రాజగోపాల్ రెడ్డికి అల్ ది బెస్ట్ చెప్పిన కూసుకుంట్ల

బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అల్ ది బెస్ట్ చెప్పారు. నల్గొండ పట్టణంలోని కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న రాజగోపాల్ రెడ్డిని కూసుకుంట్ల పలుకరించారు. ఈ సందర్భంగా అల్ ది బెస్ట్ చెప్పారు. అటు కూసుకుంట్లకు కూడా రాజగోపాల్ రెడ్డి అల్ బెస్ట్ చెప్పారు.

కొనసాగుతున్న లెక్కింపు..
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటగా చౌటప్పల్ మండల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదటి రౌండ్ ఫలితం 9.15 గంటలకు రానుంది. పూర్తి ఫలితాలు మధ్యాహ్నం వరకు రానున్నాయి. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది.