మునుగోడు బైపోల్ ఆరో రౌండ్ ఫలితం

మునుగోడు బైపోల్ ఆరో రౌండ్ ఫలితం

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రతి రౌండ్‭లోనూ టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. మరోవైపు.. కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోందని.. అభ్యర్థుల నుంచి ఆందోళనలు రావడంతో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వివరణ ఇచ్చారు. ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అభ్యర్థులు ఎక్కువగా ఉండటం వల్లే కౌంటింగ్ ఆలస్యం అవుతోందని ఆయన చెప్పారు. ఇక ఐదో రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ఆధిక్యంలో నిలిచారు. ఇక మరికొన్ని గంటల్లో మునుగోడులో ఎవరు గెలుస్తారన్నది తేలిపోనుంది. 
 
ఆరో రౌండ్ 

ఆరో రౌండ్‭లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. ఆరో రౌండ్ ముగిసే వరకు 2వేల 169 పైగా ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ కు 38,521 ఓట్లు, బీజేపీకి 36,352 ఓట్లు, కాంగ్రెస్ కు 10,063 ఓట్లు వచ్చాయి. 

మరిన్ని వార్తలు