మునుగోడు బైపోల్ నాలుగో రౌండ్ ఫలితం

మునుగోడు బైపోల్ నాలుగో రౌండ్ ఫలితం

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడనుంది. ఉప ఎన్నికలో తమదే విజయమని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగో రౌండ్ 

నాలుగో రౌండ్‭ ఓట్ల లెక్కింపు పూర్తైంది. టీఆర్ఎస్ కు 26,343, బీజేపీకి 25,729, కాంగ్రెస్‭కు 7,380, బీఎస్పీకి 907 ఓట్లు పోలయ్యాయి. నాలుగు రౌండ్ల తర్వాత 714 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యంలోకి వచ్చింది. ఇప్పటివరకు చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు పూర్తైంది. మంత్రి మల్లారెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న ఆరెగూడెం, కాటరేవురెడ్డివారి గ్రామంలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంఛార్జిగా ఉన్న లింగోజిగూడెంలోనూ బీజేపీనే అధిక్యంలోకి వచ్చింది. నాలుగు రౌండ్లు పూర్తయ్యాక టీఆర్ఎస్ కు 26,443 ఓట్లు రాగా, బీజేపీకి 25,729 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ 7వేల 380 ఓట్లు వచ్చాయి.