జవహార్ నగర్ కౌన్సిల్ ​మీటింగ్​ను బాయ్​కాట్​చేసిన టీఆర్ఎస్​ కార్పొరేటర్లు

జవహార్ నగర్  కౌన్సిల్ ​మీటింగ్​ను బాయ్​కాట్​చేసిన టీఆర్ఎస్​ కార్పొరేటర్లు

జవహర్​నగర్, వెలుగు: తమ డివిజన్ల అభివద్ధికి నిధులు ఇవ్వకుండా  మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ వారికి అనుకూలంగా ఉండే డివిజన్లకే కేటాయిస్తున్నారంటూ జవహర్​నగర్ ​టీఆర్ఎస్ ​కార్పొరేటర్లు ఆరోపించారు. గురువారం కార్పొరేషన్​ ఆఫీసులో నిర్వహించిన కౌన్సిల్​మీటింగ్​ను బాయ్​కాట్ ​చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేయర్​మేకల కావ్య కార్పొరేషన్ ​సిబ్బందిని తన సొంత పనులకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

కౌన్సిల్​ మీటింగ్‌కు వచ్చి అరగంటసేపు వేచి చూసినా తమకు కనీసం కుర్చీలు కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్​ఏర్పడి మూడేండ్లు గడుస్తున్నా ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని వాపోయారు. తమ డివిజన్లలోని కాలనీల్లో పర్యటించాలంటే ఇబ్బందిగా ఉందని, జనాలు నిలదీస్తున్నారని చెప్పారు. బాయ్​కాట్​ చేసిన వారిలో కార్పొరేటర్లు, కో–ఆప్షన్​సభ్యులు ఉన్నారు.