ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు

ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు

అధికార పార్టీ టీఆర్ఎస్ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు విపక్షాల అభ్యర్థిగా ఎన్నికైన మార్గరేట్ అల్వాకే ఇస్తామని ప్రకటించింది. రేపు పార్లమెంటు భవనంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ తాజాగా ఈ నిర్ణయాన్ని తెలిపింది. టీఆర్ఎస్ ఎంపీలంతా కూడా మార్గరేట్ అల్వాకు ఓటు వేయాలని ఆదేశించింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరికి మద్దతిస్తుందోనని ఇన్నాళ్లూ చూసిన ఎదురు చూపులకు.. ఆఖరు రోజున తెరపడింది. అయితే  ఉప రాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అయితే దేశ అత్యున్నత పదవికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికై.. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చెపట్టారు. 15వ రాష్ట్రపతిగా జులై 25న పదవీ పగ్గాలు చేపట్టిన ముర్ము.. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు.