చిన్నపిల్లలను కూడా గోస పెడ్తున్న నీ తీరు సాలు దొర

చిన్నపిల్లలను కూడా గోస పెడ్తున్న నీ తీరు సాలు దొర

టీఆర్ఎస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేకపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పురుగులతో ఉన్న అన్నాన్ని పిల్లలకు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ‘‘నువ్వు ఎల్గపెడ్తా  అన్న బంగారు తెలంగాణ ఇదేనా..చిన్నపిల్లలను కూడా గోస పెడ్తున్న నీ తీరు సాలు దొర..మంచి భోజనం కూడా పెట్టలేని నీ పాలనకు సెలవు దొర’’ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

కాగా నిర్మల్ జిల్లా భైంసాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పురుగుల అన్నం వండుతుండడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. అన్నం తినక పస్తులు ఉండడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థుల పేరెంట్స్ పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. అయితే ఈ ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీకి ఫోన్ చేసి ఆరా తీశారు. నివేదిక ఇవ్వాలని విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇక ఇటువంటి ఘటనలు మరోసారి పునారవృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు.