
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ తాజా మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో చాలా వరకు గత ఎన్నికలప్పుడు ఇచ్చినవే కనిపిస్తున్నాయి. కొన్నింటిని కొద్దిగా మార్చగా.. చాలా వరకు పాత ముచ్చట్లనే మళ్లీ పెట్టారు. ఒక్క అడుగు కూడా ముందుకుపడని పలు కీలక అంశాలనైతే.. అసలు ప్రస్తావించకుండానే వదిలేశారు. గత ఎలక్షన్లలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో కీలకమైన.. హుస్సేన్‌సాగర్, మూసీ ప్రక్షాళన, రోడ్లు, డ్రైనేజీలు, చెరువుల పునరుద్ధరణ, డబుల్బెడ్రూం ఇండ్లు, ఇండ్ల పట్టాలు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల విస్తరణ వంటి హామీల్లో చాలా వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. టీఆర్ఎస్ గత మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, ప్రస్తుతం వాటి పరిస్థితి, మళ్లీ ఇచ్చిన హామీలను పరిశీలిస్తే..