సాయం అడిగిన మహిళతో సంస్కారం మరిచి ప్రవర్తించిన టీఆర్ఎస్ లీడర్

సాయం అడిగిన మహిళతో సంస్కారం మరిచి ప్రవర్తించిన టీఆర్ఎస్ లీడర్

పాన​గల్, వెలుగు: సాయం అడిగిన మహిళతో సంస్కారం మరిచి ప్రవర్తించాడో టీఆర్ఎస్ లీడర్. భర్తను కోల్పోయిన ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కామవాంఛను బయటపెట్టాడు. సాయం చేయాలంటే తన కోరిక తీర్చాలన్నాడు. వనపర్తి జిల్లా పానగల్ మండలం జమ్మాపూర్‌‌‌‌లో జరిగిన ఘటన బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.  బాధితురాలితో టీఆర్ఎస్ నాయకుడు, ఉప సర్పంచ్ నాగరాజు మాట్లాడిన ఆడియో వైరల్‌‌గా మారింది.

నాగరాజు.. బాధిత మహిళకు ఫోన్ చేసి ఆమెకున్న భూ సమస్య గురించి మాట్లాడాడు. ‘‘నీవు చెప్పిన దగ్గరనే ఉన్నా. నా కోరిక తీరిస్తే సమస్య పరిష్కరిస్తా. నాతో ఒక్క రాత్రి గడిపితే చాలు భూ సమస్యను చిటికెలో సాల్వ్ చేస్తా” అంటూ పచ్చిగా మాట్లాడాడు. దాంతో షాక్‌‌కు గురైన ఆ మహిళ.. తాను అలాంటి పని చేయలేనని, అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ బతిమిలాడింది. కానీ ఆమె మాటలను అతడు పట్టించుకోలేదు. తన కోరిక తీర్చాలంటూ పదే పదే చెప్పడంతో మహిళ ఫోన్ కట్ చేసింది. పాన గల్ పోలీస్ స్టేషన్‌‌లో నాగరాజుపై ఈ నెల 9న బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆడియో రికార్డ్‌‌ను ఫిర్యాదు కాపీకి జత చేసింది. మహిళ భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన ఇద్దరు పిల్లలతో ఆమె జీవనం సాగిస్తున్నది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. తనకు ఏమైనా జరిగితే కారణం ఉప సర్పంచ్ నాగరాజేనని చెప్పింది.