బండి సంజయ్ కోడ్ ను ఉల్లంఘించారంటూ టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

బండి సంజయ్ కోడ్ ను ఉల్లంఘించారంటూ టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నల్గొండ జిల్లా ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో ప్రమాణం చేయడం ఎన్నికల నిబంధనలను ఉల్లఘించడమేనన్నారు. మునుగోడులో డబ్బులు పంచుతున్న బీజేపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం 5 అంశాలతో జిల్లా ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. 

ఇక అంతకుముందు శనివారం సాయంత్రం మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై  కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో 48 గంటలపాటు నిషేధం విధించింది. ఇవాళ అంటే శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 48 గంటల పాటు మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ఎలాంటి ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనరాదని.. అలాగే పత్రికా సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూ లలో కూడా పాల్గొనరాదని ఆదేశించింది. ఈనెల 25వ తేదీన ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే స్కీంలు అన్నీ ఆగిపోతాయని మంత్రి జగదీష్ రెడ్డి చేసిన ప్రసంగంపై  బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.