వైఎస్ షర్మిళ పార్టీ పెడుతుందంటేనే TRS నేతలు భయపడుతున్నారు

వైఎస్ షర్మిళ పార్టీ పెడుతుందంటేనే TRS నేతలు భయపడుతున్నారు

మహిళ పార్టీ పెడుతుందంటేనే టీఆరెస్ నేతలు భయపడుతున్నారు ఇందిరా శోభన్. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ షర్మిళ టీంలో చేరిన ఆమె.. మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. పోలవరం ముంపు మండలాలపై గంగుల కమలాకర్ అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. తన సొంత ప్రభుత్వం పై కేసు వేసిన ఆయన ముంపు మండలాలపై కూడా కేసు పెట్టాలన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదని ఆరోపించారు. ముందు రైతు సంక్షేమం పై దృష్టి పెట్టాలని సూచించారు. వైఎస్ షర్మిళ పార్టీ పెడుతుంది అంటే TRS నాయకుల కూసాలు కదులుతున్నాయన్నారు. 

రైతులకు వైఎస్ఆర్ ఏం చేశారో రికార్డులు తిరగేలంటూ గంగులను కోరారు. పెదవాళ్ళను విద్యకు దూరం చేసింది మీ ప్రభుత్వం కదా అని ప్రశ్నించారు ఇందిరా శోభన్. బంగారు తెలంగాణ కాదు.. బతుకులేని తెలంగాణ గా తయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామగ్రామనికి వైన్ షాప్ లను తీసుకెళ్లి తాగుబోతుల తెలంగాణ గా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళ పార్టీ పెడుతుందంటేనే టీఆరెస్ నేతలు భయపడుతున్నారన్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం కేంద్రాన్ని... టీఆర్ఎస్ ఎప్పుడైనా నిలదీసారా అని ప్రశ్నించారు. తెలంగాణ హక్కులకోసం షర్మిళ 100 శాతం నిలబడుతుందని స్పష్టం చేశారు. షర్మిళ పై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

ముంపు మండలాలు ఏపీలో కలిపిన ఏడున్నర ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు ఇందిరా శోభన్. ఏడున్నర ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. అభద్రతాభావంలో మంత్రి పువ్వాడ ఉన్నారన్నారు. పార్టీ ఆవిర్భావం ఎప్పుడు, ఎందుకు పెడుతున్నాం అనే అంశాలను ఏప్రిల్ 9న ప్రకటిస్తామన్నారు. విధివిధానాలు పార్టీ ఆవిర్భావం రోజే ప్రకటిస్తామన్నారు.