
అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు హరితహారంలో ప్రోటోకాల్ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో కూడా ఈ రోజు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్టేజీ మీద ప్రభుత్వంలో ఉన్నవాళ్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఖమ్మం హరితహారం కార్యక్రమంలో మాత్రం ఏ పదవీ లేకున్నా పెద్ద స్థాయి లీడర్లు స్టేజీపై కూర్చున్నారని చిన్న స్థాయి లీడర్లు మండిపడుతున్నారు. హరితహారం కార్యక్రమ స్టేజీ మీద మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ కూర్చున్నారు. అయితే వారి పక్కనే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు కూడా కూర్చున్నారు. పైగా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తో మంతనాలు కూడా చేస్తున్నారు. దాంతో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనానికి లోనయ్యారు. పెద్ద స్థాయి లీడర్ కి ఒక ప్రోటోకాల్.. చిన్న స్థాయి లీడర్ కి మరో ప్రోటోకాల్ అంటు మండిపడుతున్నారు.
For More News..