పోలీస్ సిబ్బందిపై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే గువ్వల

పోలీస్ సిబ్బందిపై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే గువ్వల

వివాదాలకు కేరాఫ్ గా మారారు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. నోటి దురుసుతో కోరి తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. గతంలో పాలమూరు జడ్పీ మీటింగ్ లో సహచర ఎమ్మెల్యేపై చేయి చేసుకోవటం వివాదాస్పదమైంది. అచ్చంపేట నియోజకవర్గంలో వికలాంగుడిపై దాడి చేయటంపై విమర్శలు వచ్చాయి. హూజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా రాజీనామా సవాల్ చేసి,  ఇరకాటంలో పడ్డారు. బైపోల్ లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో ఎమ్మెల్యే పదవికి ఎపుడు రాజీనామా చేస్తారంటూ ఆయనకు అనేక ఫోన్ కాల్స్  వచ్చాయి. రాజీనామా డిమాండ్ సెగతో మనశ్శాంతి కోల్పోయిన ఎమ్మెల్యే బాలరాజు ... డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిపై నోరు పారేసుకున్నారు. 

ఈ సారి ఏకంగా సీఎం బందోబస్తులో ఉన్న పోలీసులనే టార్గెట్ చేశారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. సీఎం బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందిని పరుష పదజాలంతో దూషించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదినకర్మలో భాగంగా మంత్రి ఫాం హౌస్ లోకి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెహికల్ ను పోలీసులు అనుమతించలేదు. దీంతో బాలరాజుకు కోపం మొచ్చింది. నన్నే ప్రశ్నిస్తారా అంటూ అసహనంతో ఊగిపోయిన గువ్వల... పోలీసుల పైపైకి వెళ్లబోయాడు. గన్ మెన్లు, స్థానిక టీఆర్ఎస్ లీడర్లు గువ్వల బాలరాజును ఆపే ప్రయత్నం చేశారు. ఏయ్... వీడియో బంద్ చెయ్ అని ఒకరిని, రిపోర్ట్ రాస్కుంటవా... ఐతే రాస్కో అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. మీరు మాట్లాడే పద్దతి బాగోలేదంటూ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పోలీసులు సూచించారు. దీంతో అసహనంతోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల తర్వాత  రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వరుస ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫోన్ సంభాషణలోనూ ఎమ్మెల్యే గువ్వల శృతి మించి మాట్లాడటం... అవతలి వైపు నుంచి అలాంటి స్పందనే ఎదురుకావటంతో గువ్వలను షాక్ తగిలింది. వరుస ఫోన్ కాల్స్ గువ్వలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాజీనామా డిమాండ్ తో ఒత్తిడికి లోనవుతున్న గువ్వల అనవసరంగా నోరుపారేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 

https://www.youtube.com/watch?v=9SffwGVGIYY