ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా
  • స్వల్ప లక్షణాలే.. వైద్యుల సూచనలు పాటిస్తున్నా: జీవన్ రెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా సోకింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నిన్న కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన వెంటనే హోం ఐసొలేషన్ కు వెళ్లిపోయారు. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గత వారం రోజులుగా తనతో సన్నిహితంగా తిరిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా సోకకపోయినా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు.