రాహుల్ గాంధీ ట్వీట్ కి కవిత కౌంటర్

రాహుల్ గాంధీ ట్వీట్ కి  కవిత కౌంటర్

రాహుల్ గాంధీ ట్వీట్ పై స్పందించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలపడం కరెక్ట్ కాదని రాహుల్ గాంధీని ఉద్దేశించి.. ట్వీట్ చేశారు కవిత. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారని రాహుల్ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారు కవిత. నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలపండని... విమర్శించారు. ఒక దేశం... ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండని ట్వీట్ చేశారు కవిత.

తెలంగాణలో రైతుల శ్రమతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రాజకీయం చేయడం సిగ్గుచేటు అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతక బాధ్యతను విస్మరించాయన్నారు రాహుల్ గాంధీ. రైతు వ్యతిరేక విధానాలు మానాలని అన్నారు. రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.