కాళేశ్వరం నీళ్లు కమలాపూర్ రైతుల కాళ్ళు కడుగుతున్నాయి

కాళేశ్వరం నీళ్లు కమలాపూర్ రైతుల కాళ్ళు కడుగుతున్నాయి

కాళేశ్వరం నీళ్లు కమలాపూర్ రైతుల కాళ్ళు కడుగుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. గత పాలకులు రైతులను పట్టించుకోలేదని..టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతుల పండించిన వడ్లను కేంద్రం కొనకపోతే రాష్ట్ర  ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి అండగా నిలిచిందన్నారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఇస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో లక్ష రూపాయలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

8 ఏళ్ల నుండి సొంత గ్రామంలో కనీసం బస్టాండ్ కూడా కట్టించలేని స్థితిలో ఈటల ఉన్నారని..మంత్రిగా పనిచేసి సొంతూరు అభివృద్ధి పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయివుండి కూడా గ్రామ సభకు రాడని..ప్రజల కష్టాలు కూడా తెల్సుక స్థితిలో ఈటలు ఉన్నారన్నారు. ఇక నుండి కమలాపూర్ నీది కాదు నాది.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా..లేకపోతే మరోసారి ఓట్లు అడగను అంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు.