రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం సున్నా : నామా

రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం సున్నా : నామా

ఖమ్మం: కొత్త రాష్ట్రమైన  తెలంగాణ ను కేంద్ర ప్రభుత్వం  ఏ పరిస్థితిలోనూ  ఆదుకోలేదన్నారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. కేంద్రం మాటలు చెప్పటమే కానీ తెలంగాణ కు ఇచ్చిందేమీ లేదని ఆయన అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోద ఇవ్వాలని కేంద్రాన్ని నిలదీశామన్నారు.  విభజన చట్టంలోని హామీ ప్రకారం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, కొత్త రైల్వే లైన్ల కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశామని తెలిపారు. మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం పార్లమెంట్ లో ప్రశ్నించామని.. ఇన్ని అభ్యర్థనలు చేసినా… రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం శూన్యమని ఆయన అన్నారు.

కేంద్రం ఏ ఒక్క ప్రాజెక్టు కు నిధులు ఇవ్వలేదని, అందుకే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్ లో నిలదీసినట్టు ఎంపీ తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఇవ్వాలని కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెండు కాలేజీలు ఇవ్వాలని అడిగినట్టు నామా వెల్లడించారు. కేంద్రం తీసుకొస్తున్న హర్ ఘర్ జల్ పథకం మన మిషన్ భగీరథ పథకం లాంటిందేనని.. దానికి నిధులు ఇవ్వాలని కోరామన్నారు. రైతుబందు స్పూర్తితోనే కేంద్రం కిసాన్ యోచన పథకం తీసుకొస్తుందని ఆయన అన్నారు. కీలక సమయాలలో , బిల్లుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేంద్రానికి అండగా నిలిచారని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ .. ప్రపంచంలో నే అధ్బుతమైన లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్  అని, కాళేశ్వరం చూడాలని ఎంపీలను, కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించామని ఎంపీ  ఈ సందర్భంగా అన్నారు.