టీఆర్ఎస్ హామీలపై పార్టీ నేతలను ప్రశ్నించాలి

టీఆర్ఎస్ హామీలపై పార్టీ నేతలను ప్రశ్నించాలి

బోధన్, వెలుగు: ఇచ్చిన హామీల అమలు ఏమైందని టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను, లీడర్లను ఓట్ల కోసం వచ్చినప్పుడు నిలదీయాలని ప్రజలకు గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ పిలుపునిచ్చారు. గురువారం నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం నర్సాపూర్​ శివారులో ‘ ప్రజా గోస -– బీజేపీ భరోసా’ యాత్రను ఆయన ప్రారంభించి బైక్​ర్యాలీలో పాల్గొన్నారు.  అంతకు ముందు హనుమాన్ మందిరంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. రాజా సింగ్​ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో గల్లీగల్లీకి.. వద్దు కేసీఆర్​, సాలు కేసీఆర్​,  ఇంటికి పో కేసీఆర్..​ అనే నినాదాలు వినిపిస్తున్నయ్​. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్​ అమలు చేయలేదు” అని మండిపడ్డారు.బోధన్​ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి గెలుస్తారని సర్వేలో తేలడంతో ఇక్కడి  ఎమ్మెల్యే షకీల్​పరేషాన్​లో పడ్డారని రాజాసింగ్​ అన్నారు. రాజా సింగ్​ వెంట  బీజేపీ  జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, నాయకులు మేడపాటి ప్రకాష్​రెడ్డి, కొలిపాక బాల్​రాజ్​, పోశెట్టి, నర్సింహరెడ్డి, సుధాకర్​చారి తదితరులు పాల్గొన్నారు.