
- వైద్యాన్ని రాష్ట్రాలకు బదలాయించాలి: కేటీఆర్
- గ్లోబల్ హెల్త్ కేర్‌లో దయనీయ స్థితిలో ఉన్నాం
- 30 ఏళ్లలో పది ర్యాంకులే ముందుకెళ్లాం
- ఆయుష్మాన్ కన్నా ఆరోగ్యశ్రీనే మేలు
- వైద్యం పై ప్రజలు, పాలకుల దృక్కోణం మారాలి: సుబ్రహ్మణ్యం
‘‘వరంగల్ జిల్లాలో ఎక్కడో మారుమూలన ఉన్న ఆస్పత్రిపై కేంద్రం అజమాయిషీ ఎందుకు? నా నియోజకవర్గం సిరిసిల్లలోని పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల బాధ్యత కేంద్రం చేతుల్లో ఎందుకు?’’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వైద్యాన్ని రాష్ట్రాలకు బదలాయించాల్సిన అవసరం ఉందన్నారు. . గ్లోబల్ హెల్త్ కేర్ ర్యాంకుల్లో 1990లో భారత్ 153వ స్థానంలో ఉంటే ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా 143వ ర్యాంకులో ఉందని చెప్పారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న బయో ఏసియా–2019 సదస్సులో భాగంగా మంగళవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంతో నిర్వహించిన ‘షేపింగ్ ఇండియాస్ రోల్ ఇన్ గ్లో బల్ హెల్త్ కేర్. ఎ పొలిటికల్ అండ్ ఎకనామిక్ పర్స్‌పెక్టివ్’ చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం ప్రజెంటేషన్ ఇస్తూ మాట్లాడారు. ‘‘ప్రభుత్వాల దృష్టి కోణంలో హెల్త్ కేర్ పై ఇంకా వివక్ష కొనసాగుతోంది. పొరుగునే ఉన్న శ్రీలంక, చైనా, థాయ్ లాండ్ కన్నా ఇండియా గ్ లో బల్ హెల్త్ కేర్ ఇండెక్స్‌లో మనదేశం కింది స్థాయి లో ఉంది. ప్రజా వైద్యాని కి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు శ్రీలంక, ఇండోనేషియా, థాయ్ లాండ్, ఘనా కన్నా తక్కువగా ఉంది. గ్లోబల్ హెల్త్ కేర్ లో ప్రస్తుతం భారత్ 143 ర్యాంకులో ఉంటే శ్రీలంక 71వ స్థానంలో ఉంది. వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కన్నా వచ్చిన వ్యాధికి చికిత్స అందించడమే ఇండియాలో ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య విధానంలో పాలకుల దృక్కోణం మారాల్సి ఉంది.
వ్యాధికి చికిత్స అందించడం ముఖ్యం కాదు. దాన్ని నిరోధించడమే ముఖ్యం . ప్రజలకు ప్రభుత్వాస్పత్రుల కన్నా ప్రైవేటు ఆస్పత్రులపైనే నమ్మకం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాల్సి న అవసరం ఉంది. అల్లోపతితో పాటు సంప్రదాయ వైద్య విధానాలు ఆయుర్వేదం, హోమియోపతిపైనా దృష్టి సారించాలి’’ అని ఆయన చెప్పారు. దేశ సైనికులు శత్రు శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహిస్తున్నట్టుగానే క్యాన్సర్ తదితర వ్యా ధులపై సాంకేతికతతో స్ట్రయిక్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సుబ్రహ్మణ్యం సమాధానాలిచ్చారు.
కేటీఆర్ ను ఆయన పలుమార్లు మంత్రిగా సంబోధించడంతో తాను ఇప్పుడు మంత్రిని కాదని చెప్పారు. ‘‘మందుల పరిశోధన కోసం డ్రగ్ కంపెనీలు బిలియన్లు, మిలియన్ల డబ్బు ఖర్చు చేస్తున్నాయి . దాని ప్రభావం వైద్య పరికరాలు, మందులు, చికిత్సపై పడుతోంది. దీని పర్యవసానం ఇండియన్ లైఫ్ సైన్సెస్ ఎలా ఉంది’’ అని కేటీఆర్ అడగ్గా.. డ్రగ్ కంపెనీల ఆవిష్కరణలు ఆహ్వానించదగ్గవేనని, అయితే వాటిపై గుత్తాధి పత్యం కోసం కంపెనీలు ప్రయత్నించడం సరికాదని సుబ్రహ్మణ్యం చెప్పారు. జనరిక్ మెడిసిన్ తో మందుల ధరలను నియంత్రించవచ్చన్నారు. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు.
కేంద్రం కూడా ఇలా చేయొచ్చు కదా? కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కన్నా ఉమ్మడి ఏపీలో ఆరంభించిన ఆరోగ్యశ్రీనే బాగుందని కేటీఆర్ అన్నారు. అయినా కేంద్ర పథకాన్ని అమలు చేయట్లేదంటూ తమపై నిందలు వేస్తున్నారనగా.. రాష్ట్రాలు జిల్లాలకు నిధులివ్వడం లేదు కదా అని సుబ్రహ్మణ్యం ఎదురు ప్రశ్నించారు. 14 వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పన్నుల వాటాను 32 శాతానికి పెంచిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కంటివెలుగు పథకం కింద 1.70 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించిందని, త్వరలోనే దంత పరీక్షలు నిర్వహించబోతున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి అందరి హెల్త్ ప్రొఫైల్స్ సేకరించాలనేది సీఎం లక్ష్యమని, కేంద్రం కూడా ఇలాంటి ఆలోచన చేస్తే బాగుటుందని సూచించారు. ఇది మంచి ఆలోచన అని, పథకం సక్సెస్ రేట్ ఆధారంగా దాని పై అధ్యయనం చేస్తామని సుబ్రహ్మణ్యం కొనియాడారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యంను కేటీఆర్ ఘనంగా సత్కరించారు.