కాంగ్రెస్ విలీనంపై TRS ఫోకస్ : ఉత్తమ్ రిజైన్ తో మళ్లీ చర్చ

కాంగ్రెస్ విలీనంపై TRS ఫోకస్ : ఉత్తమ్ రిజైన్ తో మళ్లీ చర్చ

TRSLP లోకి కాంగ్రెస్  శాసనసభాపక్షం విలీనం వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. లోక్ సభ ఎన్నికలకు ముందే విలీనం ఉంటుందని ప్రచారం జరిగింది. వరుసగా ఎంపీ, పరిషత్ ఎలక్షన్ హడావిడిలో కొంత బ్రేక్ ఇచ్చిన టీఆర్ఎస్ మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసెంబ్లీలో కాంగ్రెస్  బలం 19 ఎమ్మెల్యేలు. విలీనానికి మూడింట రెండొంతులు అవసరం. అంటే 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరితో సరిపోతుంది. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించారు.

ఎపఐతే హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. విలీన ప్రక్రియకు మరో ఎమ్మెల్యే అవసరం.  ఈ నెల 8 న జడ్పీ ఛైర్ పర్సన్ల ఎన్నిక జరుగుతుంది. అది పూర్తయ్యాక కాంగ్రెస్  నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు భేటీ అయి విలీనంపై తీర్మానం చేసే అవకాశం ఉంది. ఆ  లేఖను శాసనసభ కార్యదర్శికి ఇస్తారని తెలుస్తుంది.