సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు యత్నించిన TRT అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. SGT అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తాము పరీక్షలు రాసి…పాసైనా కూడా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు,5 వేల 692 పోస్టులకు కేవలం 2 వేల మందికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికే ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరును ఉధృతం చేస్తామని హెచ్చరించారు అభ్యర్థులు.

