వలస కూలీల ట్రక్కును ఢీకొట్టిన బస్సు

వలస కూలీల ట్రక్కును ఢీకొట్టిన బస్సు
  • 8 మంది మృతి, 54 మందికి గాయాలు
  • మధ్యప్రదేశ్‌లో ఘటన

గుణ: మధ్యప్రదేశ్‌లోని గుణలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది చనిపోగా.. మరో 54 మందికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. దెబ్బలు తగిలిన వాళ్లను దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో 70 మంది కూలీలు ఉన్నారు. వాళ్లంతా మహారాష్ట్ర నుంచి ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఉన్నావోకు వస్తున్నట్లు అధికారులు చెప్పారు. చనిపోయిన వారిలో అందరూ ఉన్నావోకు చెందిన కూలీలే. కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు గుణ బైపాస్‌ వద్దకు రాగానే అదుపుతప్పి బస్సును ఢీకొట్టిందని పోలీస్‌ ఆఫీసర్‌‌ చెప్పారు. బస్సులో డ్రైవర్‌‌, క్లీనర్‌‌ మాత్రమే ఉన్నారని, గుణ నుంచి అహ్మదాబాద్‌ వెళ్తోందని అన్నారు. దెబ్బలు తగిలిన వారిని సొంత ఊళ్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ముజఫర్‌‌ నగర్‌‌లో రోడ్డుపై నడిచివెళ్తున్న కూలీలపైకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు వలస కూలీలు చనిపోయారు.

Read more news

వ‌ల‌స కూలీల‌పై దూసుకెళ్లిన బ‌స్సు.. ఆరుగురు మృతి