ఇండియాపై 25 శాతం పన్ను విధించిన ట్రంప్ : రష్యా ఆయిల్ కొనుగోళ్లపై ప్రతీకారం

ఇండియాపై 25 శాతం పన్ను విధించిన ట్రంప్ : రష్యా ఆయిల్ కొనుగోళ్లపై ప్రతీకారం

ట్రంప్ అన్నంత పనీ చేశాడు.. మోడీ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే ఇండియాపై పన్నులు బాదేశాడు.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు.. ఇండియాపై 25 శాతం సుంకం విధించాడు అమెరికా అధ్యక్షుడు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని.. ఇండియా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై ఇప్పుడు ఉన్న సుంకం కంటే.. అదనంగా మరో 25 శాతం చెల్లించాలంటూ ఆర్డర్స్ వేశాడు ట్రంప్. ఆగస్టు 1 నుంచి ఇండియన్ ఇంపోర్ట్స్ పై 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపాడు ట్రంప్.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ భారత్ తన మిత్రదేశమని.. ప్రధాని మోదీ తన స్నేహితుడని చెప్పారు. ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ జరగలేదని బదులిచ్చిన ట్రంప్.. అన్ని దేశాలకంటే ఎక్కువ సుంకాలను భారత్ విధిస్తోందని చెప్పారు. అనేక సంవత్సరాలుగా ఇదే కొనసాగుతోందని..ఇకపై ఇలా చేయటం న్యాయం కాదన్నారు ట్రంప్.

 

ఇండియా తమ మిత్ర దేశమే అయినప్పటికీ అధిక సుంకాల కారణంగా ఇండియాతో తక్కువ వ్యాపారం చేస్తున్నామని అన్నారు ట్రంప్. ప్రపంచంలోనే అన్ని దేశాలకంటే ఇండియా సుంకాలు అధికంగా ఉన్నాయని.. ఇండియాకు వాణిజ్యేతర, ద్రవ్యేతర విధానాలు అడ్డంకిగా మారాయని అన్నారు ట్రంప్.

రష్యాతో ఇండియా రక్షణ, ఇంధన సంబంధాన్ని కోట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇండియా తమ సానిక పరికరాలు ఎక్కువ శాతం రష్యా నుంచే కొనుగోలు చేస్తోందని.. ఉక్రెయిన్ పై రష్యా దాడులను ఆపాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు ట్రంప్.