చైనా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అగ్రరాజ్యాల మధ్య కీలక చర్చలు.

చైనా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అగ్రరాజ్యాల మధ్య కీలక చర్చలు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది.  ట్రంప్,  చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలిసి సైనిక గౌరవ వందనం స్వీకరించారు. ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో చైనాదే పైచేయి అని నిపుణులు భావిస్తున్నారు.

చైనాకు కలిసి వచ్చే అంశాలు
సమాచారం ప్రకారం, ఈ కాలం చైనాకు చాలా అనుకూలంగా కలిసొచ్చింది. ఎందుకంటే  అమెరికా ప్రస్తుతం పశ్చిమ ఆసియా ఘర్షణల్లో  నిలుస్తుంది. దింతో  ఒత్తిడి  కారణంగా ట్రంప్ ప్రజాదరణ తగ్గిపోతు.. అయన గ్రాఫ్ పడిపోతుంది. మరోపక్క  నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల వల్ల ఎలాగైనా ఒక విజయం సాధించాలని ట్రంప్ ఆరాటపడుతున్నారు.

అసలు విషయం  ఏంటంటే 
గతేడాది ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ట్రంప్ చైనా వస్తువులపై భారీగా పన్నులు వేశారు. ఒక దశలో ఇది 145 శాతం వరకు వెళ్లింది. దీనికి బదులుగా చైనా కూడా అమెరికా వస్తువులపై పన్నులు వేసింది. ముఖ్యంగా కార్లు, స్మార్ట్‌ఫోన్ల తయారీకి కావాల్సిన ఖనిజాల ఎగుమతులను నిలిపివేసింది. ప్రస్తుతం ఈ గొడవ కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా, ఇరు దేశాల సంబంధాలు మాత్రం ఇంకా మెరుగుపడలేదు.

మారుతున్న వ్యాపారాలు
చైనా నుంచి దిగుమతులు తగ్గడంతో అమెరికా కంపెనీలు ఇప్పుడు మెక్సికో, వియత్నాం, తైవాన్ వంటి దేశాల వైపు చూస్తున్నాయి. అదే సమయంలో, చైనా  మాత్రం వ్యాపారాన్ని ఇతర దేశాలతో పెంచుకుంది. గతేడాది చైనా సుమారు 1.2 ట్రిలియన్ డాలర్ల లాభాన్ని గడించింది. దీనివల్ల అమెరికాపై చైనా ఆధారపడటం క్రమంగా తగ్గుతోంది.

 నిపుణుల విశ్లేషణ ప్రకారం చైనా బలంగా ఉండటానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి చైనా ఎగుమతులపై అమెరికా ఆంక్షల ప్రభావం పెద్దగా పడలేదు. ఇంకోటి చైనా కొత్తగా గ్యాస్ పైప్‌లైన్‌లను ఏర్పాటు చేసుకుని దాని  శక్తిని పెంచుకుంది. ప్రపంచంలో ఎక్కడా చైనా యుద్ధాల్లో పాల్గొనడం లేదు, కానీ అమెరికా మాత్రం అనేక సమస్యల్లో ఇరుక్కుపోయింది. అందుకే ఈ చర్చల్లో షీ జిన్‌పింగ్ మాటకే ఎక్కువ విలువ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.