 
                                    సియోల్: భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కామెంట్ చేశారు. ఇరు దేశాలను బెదిరించి మరీ దారికి తెచ్చానని చెప్పుకొచ్చారు.
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత తనదేనన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 10న పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన ఉద్రిక్తతలను 250% టారిఫ్ బెదిరింపులతోనే ఆపానని తెలిపారు.
‘‘భారత్-పాక్ మధ్య ఘర్షణలో 7 విమానాలు నేలకూలాయి. యుద్ధం మొదలైంది. భారత ప్రధాని మోదీ, పాక్ నేతలతో నేను ఫోన్‌లో మాట్లాడా.. మీ దేశాలపై 250% టారిఫ్ విధిస్తా... మీరు ఎప్పటికీ అమెరికాతో వ్యాపారం చేయలేరు అని హెచ్చరించా. రెండు రోజుల తర్వాత వెంటనే సీజ్‌ఫైర్ కుదుర్చుకున్నారు” అని ట్రంప్ తెలిపారు.

 
         
                     
                     
                    