క్యాపిటల్ అల్లర్ల బాధితులకు డొనేషన్స్ సేకరిస్తున్న ట్రంప్

క్యాపిటల్ అల్లర్ల బాధితులకు డొనేషన్స్ సేకరిస్తున్న ట్రంప్

2020లో డొనాల్డ్ ట్రంప్‌, జో బైడెన్ మ‌ధ్య జ‌రిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల  వార్ ఫ‌లితాలు ఉత్కంఠ రేపాయి. ఆ ఎన్నికల్లో ఓట‌మి త‌ట్టుకోలేని ట్రంప్ తన‌ మ‌ద్దతుదారుల్ని రెచ్చగొట్టి క్యాపిటల్ హిల్ పై దాడికి వేల సంఖ్యలో జనాన్ని ఉసిగొల్పాడని, విద్వేష ప్రసంగాలు ఇచ్చాడని ట్రంప్ ఆరోపనలు ఎదుర్కొంటున్నాడు. అయితే, ఆ అల్లర్లలో చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లపై ఇప్పటిరకీ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ క్యాపిటల్ అల్లర్లకు మద్దతునిలిచాడు. వాళ్లకోసం ఒక పాటను కూడా రిలీజ్ చేశాడు. 

స్పాటిఫై, యాపిల్ మ్యాజిక్, యూట్యూబ్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ల్లో ఉన్న జస్టిస్ ఫర్ ఆల్ అనే పాటను క్యాపిటల్ అల్లర్ల ఆరోపణలో జైలులో ఉన్న ట్రంప్ మద్దతుదారుల కుటుంబానికి అంకితం చేశాడు. వాళ్ల కోసం నిధులు సమకూర్చే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఈ పాటను ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో రిసార్ట్ లో రికార్డు చేశారు.