అమెరికా ప్రెసిడెంట్ పదవికి మరోసారి ట్రంప్ పోటీ

అమెరికా ప్రెసిడెంట్ పదవికి మరోసారి ట్రంప్ పోటీ


వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ పదవికి మరోసారి పోటీ పడనున్నట్లు డొనాల్డ్​ ట్రంప్​ శనివారం సంకేతాలిచ్చారు. యూఎస్​ లెజిస్లేచర్​ బిల్డింగ్​పై దాడి ఘటనపై ఆయన టెక్సాస్​లో మాట్లాడారు. ఈ దాడిలో పాల్గొన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరికి క్షమాభిక్ష పెడతానని చెప్పారు. టెక్సాస్ లోని కాన్రోలో శనివారం జరిగిన ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘2024 అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి.. నేను మళ్లీ గెలిస్తే గతంలో దాడిలో పాల్గొన్న వారి పట్ల న్యాయంగా ప్రవర్తిస్తా. క్షమాబిక్ష అవసరమైతే పెడ్తాం. ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వం వారి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తోంది’’ అని స్పష్టంచేశారు. యూఎస్​ప్రెసిడెంట్​గా బైడెన్​ఎన్నికను వ్యతిరేకిస్తూ వందలాది మంది ట్రంప్​మద్దతుదారులు నిరుడు జనవరి 6న వాషింగ్టన్​లోని యూఎస్​లేజిస్లేచర్​బిల్డింగ్​ను ముట్టడించారు. ఈ సందర్భంగా మొదలైన అల్లర్లలో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం దాదాపు 700 మందికి పైగా అరెస్ట్​చేసింది. వీరిలో హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 225 మందికి తీవ్రమైన శిక్షలు పడే ఆస్కారం ఉంది. అల్లర్లలో పాల్గొన్న వారిపై జరుగుతున్న విచారణకు వ్యతిరేకంగా ట్రంప్ పదేపదే మాట్లాడుతున్నారు. తాజాగా వారి గురించి మరో కామెంట్​చేయడంతో పాటు అధ్యక్ష బరిలో ఉన్నానని పరోక్షంగా సంకేతమిచ్చారు.