అమెరికాగ్రీన్‌‌‌‌ కార్డ్‌‌‌‌ లాటరీ నిలిపివేత..బ్రౌన్‌‌ వర్సిటీలో కాల్పులతో ట్రంప్ నిర్ణయం

అమెరికాగ్రీన్‌‌‌‌ కార్డ్‌‌‌‌ లాటరీ నిలిపివేత..బ్రౌన్‌‌ వర్సిటీలో కాల్పులతో  ట్రంప్ నిర్ణయం

అమెరికా గ్రీన్‌‌‌‌కార్డ్‌‌‌‌ లాటరీ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రెసిడెంట్‌‌‌‌ ట్రంప్‌‌‌‌ ప్రకటించారు. ఇటీవల బ్రౌన్‌‌‌‌ వర్సిటీలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి లాటరీ ద్వారానే అమెరికాకు వచ్చి ఉంటున్నాడు. దీనిని దృష్టిలో పెట్టుకునే గ్రీన్‌‌‌‌కార్డ్‌‌‌‌ లాటరీ సిస్టమ్‌‌‌‌కు ట్రంప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ వేసినట్లు తెలిసింది.

  • అమెరికా గ్రీన్​కార్డ్‌‌ లాటరీ నిలిపివేత
  • బ్రౌన్‌‌ వర్సిటీలో కాల్పుల వల్లే ట్రంప్ నిర్ణయం

వాషింగ్టన్: అమెరికా గ్రీన్‌‌కార్డ్‌‌ లాటరీ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రెసిడెంట్‌‌ డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ ప్రకటించారు. ఇటీవల బ్రౌన్‌‌ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఈ లాటరీ సిస్టమ్‌‌ ద్వారానే అమెరికాకు వచ్చి నివాసం ఉంటున్నాడు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రీన్‌‌కార్డ్‌‌ లాటరీ సిస్టమ్‌‌కు ట్రంప్‌‌ బ్రేక్‌‌ వేసినట్లు అధికారులు వెల్లడించారు.

ట్రంప్‌‌ ఆదేశాలతోనే ఈ కార్యక్రమాన్ని ఆపేయాలని నిర్ణయించినట్లు హోం ల్యాండ్‌‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్‌‌ పేర్కొన్నారు. ఇలాంటి దారుణమైన వ్యక్తులను అమెరికాలోకి ఎప్పటికీ అనుమతించకూడదని ఆమె అన్నారు. 

క్లాడియో నెవ్స్‌‌ వాలెంటే(48) అనే వ్యక్తి ఇటీవల బ్రౌన్‌‌ యూనివర్సిటీలో ఇద్దరు స్టూడెంట్లను, ఒక ప్రొఫెసర్‌‌‌‌ను కాల్చి చంపేశాడు. మరో 9 మందికి బులెట్‌‌ గాయాలయ్యాయి. ఆపై తనకు తానే కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోర్చుగీస్‌‌కు చెందిన నెవ్స్‌‌ వాలెంటే 2017లో గ్రీన్‌‌కార్డ్‌‌ లాటరీ ద్వారా పర్మినెంట్‌‌ రెసిడెన్సీ హోదాలో అమెరికాకు వచ్చాడు.