ఇరాన్ కు మరోసారి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..ఒప్పందం ఉల్లంఘిస్తే భీకర దాడులు చేస్తాం

ఇరాన్ కు మరోసారి ట్రంప్  స్ట్రాంగ్ వార్నింగ్..ఒప్పందం ఉల్లంఘిస్తే భీకర దాడులు చేస్తాం

సీజ్ ఫైర్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటమార్చారు.సీజ్ ఫైర్ ఒప్పందంలోభాగంగా హార్ముజ్ జలసంధిని తెరవకుంటే భీకర దాడులు చేస్తామని హెచ్చారించారు. మా సైన్యం, యుద్దనౌకలు, యుద్ద విమానాలు సహా అన్ని యుద్ద సామాగ్రి ఇరాన్ చుట్టే ఉన్నాయి. ఒప్పందం పూర్తిగా అమలయ్యే వరకు అవి అక్కడే ఉంటాయని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. 

ఇరాన్ ఇప్పటికే చాలావరకు బలహీనపడింది. ఒప్పందం అమలు విఫలమైతే ఇరాన్ పై దాడులు చేసేందుకు వినకాడం.. అందుకు అవసరమైన మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, ఇతర యుద్ద సామాగ్రితో సాహా అమెరికాకు చెందిన అన్ని  యుద్ద నౌకలు, విమానాలు, సైన్యం ఇరాన్ పరిసరాల్లోనే ఉంటారు. అసలైన ఒప్పందం పూర్తిగా అమలయ్యే వరకు వారు అక్కడే ఉంటారు. ఒకవేళ ఏదైనా కారణం చేత ఒప్పందం అమలు కాకపోతే ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడని అతిపెద్ద, అత్యంత  శక్తివంతమైన రీతిలో దాడులు  చేస్తామని  వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. 

ఎన్ని అబద్ధపు ప్రచారాలు జరిగినప్పటికీ, చాలా కాలం క్రితమే ఒక ఒప్పందం కుదిరింది. - అదేమిటంటే అణు ఆయుధాలు (NO NUCLEAR WEAPONS) ఉండకూడదు ,హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) తెరిచి ఉండాలి.సురక్షితంగా ఉండాలి. ఈలోగా మా గొప్ప సైన్యం ఆయుధాలు నింపుకుంటూ, విశ్రాంతి తీసుకుంటోంది.. వాస్తవానికి తన తదుపరి విజయం కోసం ఎదురుచూస్తోందంటూ ట్రంప్ చెప్పడం ట్రుత్ సోషల్ రాశారు. 

మొత్తానికి అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తాత్కాలిక ఉపశమనంగా కనిపించినప్పటికీ, ట్రంప్ తాజా హెచ్చరికలు పశ్చిమాసియాను మళ్లీ అగ్నిగుండంగా మార్చేలా ఉన్నాయి. కేవలం 90 నిమిషాల ముందు శాంతికి మొగ్గు చూపిన ట్రంప్, ఇప్పుడు ‘అసలైన ఒప్పందం’ అమలు కాకపోతే వినాశనం తప్పదని హెచ్చరించడం, ముఖ్యంగా హార్మూజ్ జలసంధి మూసివేత, అణు ఆయుధాల అంశంపై ఆయన పట్టుబట్టడం ఇరాన్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో శాంతి చర్చలు సఫలమవుతాయా లేక ఈ రెండు వారాల గడువు ముగిశాక యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతుందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.