ఇండియా దిగుమతులపై పన్నులు పెంచుతాం: ట్రంప్‌

ఇండియా దిగుమతులపై పన్నులు పెంచుతాం: ట్రంప్‌

వెలుగు: ఇండియా ఎక్కువ ట్యాక్స్ విధించే దేశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు. దానికి బదులుగా తాము కూడా ఇండియా ఉత్పత్తులపై ట్యాక్స్ విధిస్తామన్నారు. ది మేరీల్యాండ్ జరిగిన ది కన్జర్వేటీవ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడారు. ” ఇండియా మన ఉత్పత్తులపై ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తోంది. ఒక మోటార్ సైకిల్ పంపిస్తే వందశాతం ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తారు. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతిచేసినా అంతే చార్జ్ చేస్తారు. మనం కూడా ట్యాక్స్ వసూలు చేయాలి. దాన్ని మిర్రర్ ట్యాక్స్ అనవచ్చు.

అమెరికా ఉత్పత్తులపై చాలా దేశాలు ఎక్కువ ట్యాక్స్ లు వేస్తున్నాయి. అందుకు ఇండియా ఒక ఉదాహరణ. అమెరికా కూడా ఆ దేశాల ఉత్పత్తులపై ట్యాక్స్ వసూలు చేయాల్సిన సమయం వచ్చింది. వాళ్లు వందశాతం చార్జ్ చేస్తే.. నేను25 శాతం చార్జ్ చేయాలని ఆలోచిస్తున్నా. 25 శాతం చార్జ్ చేస్తామంటే సెనెట్ లో ఆందోళనలు మొదలయ్యాయి. మీ వల్ల నేను 25 శాతం మాత్రమే చార్జ్ చేస్తున్నా. నాకు మీ మద్దతు కావాలి” అని ఆయన అన్నారు. గతంలో హార్లే డెవిడ్సన్ మోటార్ సైకిళ్లపై వందశాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 50 శాతానికి తగ్గించిన ఇండియా నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అయితే అది సరిపోదన్నారు.