ఇరాన్ లో అతిపెద్ద బ్రిడ్జి పేల్చివేత..వీడియో షేర్ చేసిన ట్రంప్..

ఇరాన్ లో అతిపెద్ద బ్రిడ్జి పేల్చివేత..వీడియో షేర్ చేసిన ట్రంప్..

ఇరాన్ లోని కరాజ్ సిటీలో నిర్మాణంలో ఉన్న అతిపెద్ద బ్రిడ్జిని గురువారం అమెరికా పేల్చివేసింది. బ్రిడ్జి కూలిపోతున్న వీడియోను ట్రంప్ ఈ మేరకు షేర్ చేశారు. ఇలాంటివే మరిన్ని దాడులు ఉంటాయని హెచ్చరించారు.

కాగా, ఇరాన్ కూడా గురువారం ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌తో పాటు గ ల్ఫ్ దేశాలపై క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ ఖరాజీ తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య చనిపోయారు. 

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ ప్రతిసవాళ్లతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఇరాన్‌‌‌‌పై రాబోయే రోజుల్లో భీకరంగా దాడిచేస్తామని ట్రంప్‌‌‌‌ స్ట్రాంగ్‌‌‌‌ వార్నింగ్‌‌‌‌ ఇవ్వగా.. అమెరికా మెడలు వంచేదాకా తమ పోరాటం ఆగబోదని ఇరాన్‌‌‌‌ సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది. దీంతో ఈ ఘర్షణ ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.  వైట్‌‌‌‌హౌస్‌‌‌‌ నుంచి జాతిని ఉద్దేశించి  ట్రంప్‌‌‌‌  ప్రసంగిస్తూ.. ఇరాన్‌‌‌‌పై అమెరికా–--ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న యుద్ధంలో తాము విజయం సాధించామని ప్రకటించారు. 

వచ్చే రెండు నుంచి మూడు వారాల పాటు ఇరాన్‌‌‌‌‌‌‌‌పై దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని  హెచ్చరించారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌ త్వరగా తమతో ఒప్పందానికి రావాలని, లేకుంటే మరింత భీకరంగా అటాక్స్‌‌‌‌‌‌‌‌ చేస్తామన్నారు. ఆ దేశాన్ని రాతియుగానికి తీసుకెళ్తామని వార్నింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.  ఇరాన్ సైనిక శక్తిని నామరూపాలు లేకుండా చేశామని, త్వరలోనే ఈ యుద్ధాన్ని ముగిస్తామని అన్నారు. ‘‘మేం వారిని తిరిగి శిలా యుగంలోకి తీసుకెళ్తాం. వారు ఉండాల్సింది అక్కడే. ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకపోతే.. ఆ దేశంలోని ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై దాడులు చేసి, దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తాం” అని  హెచ్చరించారు.